వజ్రపుకొత్తూరు మండలం, అక్టోబర్ 28:
వజ్రపుకొత్తూరు మండలంలోని అక్కుపల్లి సమీప శివసాగర్ బీచ్ ఇప్పుడు బీరు బాటిల్స్‌తో నిండిపోయింది. బీచ్‌కు పర్యటకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో వస్తున్నప్పటికీ, అక్కడ ఎక్కడ చూసినా ఖాళీ మద్యం సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు విస్తరించి కనిపిస్తున్నాయి.
సముద్ర తీరప్రాంతంలో మద్యం సీసాలు, ప్లాస్టిక్ కవర్లు, తినుబండారాల బాక్స్‌లు చెల్లాచెదురుగా పడివుండటంతో అందమైన బీచ్ దృశ్యం చెడిపోయింది. పర్యావరణానికి హాని కలిగే ఈ పరిస్థితిని చూసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
“శివసాగర్ బీచ్ ఇప్పుడు మద్యం బాబుల కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. పోలీసులు, మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి” అని స్థానికులు వై 7 న్యూస్‌తో పేర్కొన్నారు.
Post Views: 40









