సూర్యాపేట, అక్టోబర్ 28:
సూర్యాపేట జిల్లా కళ్లుగీత కార్మిక సంఘం (KGKS) జిల్లా కమిటీ సభ్యుడిగా కొమ్మగాని సైదులు గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర కళ్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి. రమణ, రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎలుగూరి గోవింద్, జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు గుణగంటి కృష్ణ గౌడ్లకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాలో కళ్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని సైదులు గౌడ్ తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం తాను అన్ని స్థాయిల్లో కృషి చేస్తానని అన్నారు.
Post Views: 34









