పలాస:
శనివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జలజీవన్ మిషన్ పై నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో అధికారులు మరియు నాయకులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా జలజీవన్ మిషన్ కు వచ్చిన
నూతన ఎస్.యి. అధికారి శంకర్ బాబు ఎమ్మెల్యే ను గౌరవంగా కలిసి పూల బొకేను అందించారు. అనంతరం జలజీవన్ మిషన్ లో మూడు మండలాల్లో జరుగుతున్న పనులపై సమీక్షించారు ఇంకా ట్యాంకులు కోసం కొన్ని గ్రామాల్లో స్థలాలు లేవు అని తెలియజేశారు. అయితే స్థానిక ఎమ్మార్వో తో కోఆర్డినేట్ చేసుకొని ఆయా గ్రామాల్లో ట్యాంకుల కోసం సర్వే చేయాలని ఆదేశించారు. ఇప్పుడు జరుగుతున్న పనులు త్వరగా పూర్తిచేసి ప్రతి ఇంటికి త్రాగునీరు అందించే విధంగా త్వరగా పనులు చేపట్టాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు డి.యి. సూర్యనారాయణ, జె.యి. సతీష్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబురావు, పీరికట్ల విఠల్, గాలి కృష్ణారావు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.









