కాశీబుగ్గ:
కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం “ఓపెన్ హౌస్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక మేధా స్కూల్ 9వ తరగతి విద్యార్థులు సుమారు 70 మంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఐ పి. సూర్యనారాయణ మాట్లాడుతూ —
“ప్రతి విద్యార్థికి చట్టాలపై అవగాహన ఉంటేనే వారు మంచి పౌరులుగా ఎదుగుతారు. పోలీస్ వ్యవస్థ పని తీరును అర్థం చేసుకోవడం విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని పెంచుతుంది” అని అన్నారు.
తదుపరి ఆయన విద్యార్థులకు పోలీస్ స్టేషన్లో జరుగే వివిధ రకాల పనులను చూపించి, వివిధ పరికరాల వినియోగాన్ని వివరించారు. పోలీసులు నిత్యం ప్రజల భద్రత కోసం ఎలా పనిచేస్తారో ప్రాక్టికల్‌గా చూపించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఎన్. నరసింహమూర్తి, సీఐ పి. సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 45









