రాస్తారోకో నిర్వహిస్తున్న రైతులు…
నకిలీ విత్తనాల కంపెనీ వల్ల రైతులు చనిపోతే కేటీఆర్ కు బాధనిపించలేదు…
అక్కడక్కడ కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం చేస్తున్న రైతులు…
కలెక్టర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న రైతులు
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు ఏటూరునాగారం…
ఏటూరునాగారం, సెప్టెంబర్ 19 వై 7 న్యూస్;
మొక్కజొన్న విత్తన కంపెనీల చేత మోసపోయి నష్టపోయిన రైతులకు రూ.ఐదు కోట్ల నష్టపరిహారం ఇప్పిస్తే కలెక్టర్ ని పింక్ బుక్లో పెడతావా? అని కేటీఆర్ పైన మండల అధ్యక్షులు చిటమట రఘు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు.ములుగు రైతులకు, ప్రజలకు న్యాయం చేసే అధికారుల పైన ఇలాంటి దుర్మార్గపు పనులకు ఒడి కడతారా.. అధికారం పోయినా మార్పు రాలేదా అని చిటమట రఘు విమర్శించారు. కలెక్టర్ పైన అనుషిత వ్యాఖ్యలు చేసిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల కేటిఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి…
భారీ ర్యాలీ నిర్వహించి, రాస్తారోకో లు చేపడుతున్న రైతులు.కలెక్టర్ దివాకరా టీఎస్ లాంటి అధికారుల పైన కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సూచించారు. ప్రజలు అధికారం ఇస్తే అధికారుల పైనీ కక్ష కట్టడం దిక్కుమాలిన చర్య అన్నారు.విత్తనోత్పత్తి కంపెనీలను అడ్డు పెట్టుకొని రైతులను ఆర్థికంగా దోపిడి చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించి రైతుల ఆత్మహత్యలకు కారణం అయిన దళారీ మాటలు మీకు కన్నీళ్లు తెప్పించాయా అని బిఆర్ఎస్ పార్టీ నాయకులు కెటిఆర్ పైన చిటమట రఘు మండిపడ్డారు.కంపెనీల మోసాలకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల విషయం లో మీకు ఎందుకు కన్నీళ్ళు రాలేదని ఆయన బిఆర్ఎస్ పార్టీని, కేటిఆర్ ని నిలదీశారు. గుడవర్తి నర్సింహ మూర్తి ఏజన్సీ రైతులను కోట్ల రూపాయలకు ముంచినందుకు కెటిఆర్ అతని ముందు శిరస్సు వంచి నమస్కరించారా ప్రశ్నించారు. బాధ్యతా యుతమైన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ప్రజల పక్షాన నిజాయితీ గా పని చేసిన ములుగు జిల్లా కలెక్టర్ దివాకరా టి ఎస్ పై ఇలాంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన హితువు పలికారు. జిల్లా కలెక్టర్ ప్రజల పక్షాన నిలబడి వ్యక్తి అని తెలియజేశారు. ములుగు ఆదివాసీ గూడెల్లో పాఠశాలలు, వైద్య సదుపాయం లేకపోతే కం ట్రైనర్ పాఠశాలలు, కంటైనర్ హెల్త్ సెంటర్స్ ఏర్పా టు చేసి విద్యా వైద్య సదుపాయాలు అందిస్తున్న కలెక్టర్ ని ఏదైనా చేయాలనీ చూస్తే ప్రజలు మరో సొరి స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్తారని అన్నారు. ప్రజ లు ఓడించినా ఇంకా మీకు బుద్ధి రాలేదా? అని ఎద్దేవా చేశారు.
కలెక్టర్ గా వచ్చిన దివాకరా టీఎస్ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. యావదు ఆస్తిని పార్టీకి ధారవత్తం చేస్తానని అంటున్న అర్గనైజర్ మొక్కజొన్ని రైతులకు నష్టపరిహారం కింద ఇస్తే బాగుంటుందని అన్నారు. రైతులకు న్యాయం జరగడానికి కలెక్టర్ వివాకరా టీఎస్ పాటు వ్యవసాయ మంత్రి తుమ్ముల, రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా మంత్రి సీతక్క అని రైతు లు తెలిపారు. కలెక్టర్ చిత్ర పటానికి రైతులు మహిళలు పాలాభిషేకం చేశారు.రైతులు కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం చేసారు. కేటీఆర్ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. కేటీఆర్, గుడవర్తి సిర్సింహా మూర్తి రైతుల కు, కలెక్టర్ కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని చిటమట రఘు అన్నారు..









