E-PAPER

అశ్వాపురం మండలంలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ

అశ్వాపురం, సెప్టెంబర్ 17 వై 7 న్యూస్:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ప్రాజెక్టు పరిధిలోని అశ్వాపురం మండల అంగన్వాడీ టీచర్లకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో “పోషణ్ భీ పాడాయ్ భీ” శిక్షణా కార్యక్రమం సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహించారు.
ఈ శిక్షణ ముగింపు సందర్భంగా, పోషణ మాసం కార్యక్రమాలను కూడా ఈరోజు (17.09.2025) లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్ భాగంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు ప్రతిరోజూ వివిధ అవగాహన కార్యక్రమాలు అంగన్వాడీ కేంద్రాలలో కొనసాగనున్నాయి.
ముగింపు కార్యక్రమంలో ఐసిడీఎస్ బూర్గంపాడు సీడిపిఓ రేవతి, సూపర్వైజర్లు ధనలక్ష్మి, సావిత్రి, పోషణ అభియాన్ బీసీ శంకర్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పోషణ మాసం కార్యక్రమాల ద్వారా పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు సరైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యమని తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News