K.P.U.G గని గేట్ మీటింగ్ లో INTUC ఉపాధ్యక్షులు కృష్ణంరాజు
మణుగూరు, సెప్టెంబర్ 19 వై7 న్యూస్;
కె పి యు జి మైన్ లో పిట్ కార్యదర్శి పొదిల రామకృష్ణ అధ్వర్యలో శుక్రవారం ఉదయం జరిగిన గేట్ మీటింగ్ లో ఏరియా ఉపాధ్యక్షులు కృష్ణంరాజు ,మరియు ఏరియా బ్రాంచి కార్యదర్శి అబ్దుల్ రాహుల్ పాల్గోని ప్రసంగించారు
ఏరియా వైస్ ప్రెసిడెంట్ కృష్ణంరాజు మాట్లాడుతు మణుగూరు ప్రాంతం కి ఉజ్జ్వల భవిష్యతు ఉంటుందని , మణుగూరు ఓసి కి 18 ఏళ్లు కొరకు అనుమతులు వస్తున్నాయి అని అలగే ఓసి-2 డిప్ సైడ్ కుడా మనం బిడ్ ద్వారా మనం సాధించుకునే ఆవకాశలు ఎక్కువుగా ఉన్నాయి అని తేలియజేసారు,ధినికి సంబంధించి చట్టప్రకారం యాక్షన్ కి వెల్లాలని ప్రభుత్వ కుడా నిర్ణయించి యజమాన్యానికి ఆదేశాలు పంపించడo జరిగింది అని కార్మికులు ఎవ్వరు ఆందోళన చెందోదని అన్నారు,
AITUC ద్వంద వైఖరిని కార్మికులు గమనించాలని మొన్న 12వ తారీకు జరిగిన చైర్మన్ స్థాయి స్ట్రక్చర్ మీటింగ్ ను బహిష్కరించి తప్పు చేశారని సమస్యలు పరిష్కరించవలసిన వేదికను AITUC ఆ దిశగా ప్రయత్నించకపోవడం కార్మికులకు నష్టం కలిగించడమే అని INTUC తప్పుబడుతున్నాం, AITUC ఇచ్చిన హామీలు ఏమైనాయి అని ప్రశ్నించారు.
1,,సొంత ఇంటి కల కలగా మిగిలిపోవాల్సిందేనా
2,,30 లక్షల రుణం ఏది
3,,300 గజాల స్థలం ఏది
4,,మారు పేరుల మార్పు ఏది
5,,పెర్క్ పై IT మాఫీ ఏది
6,,N మైనస్ వన్ ఏమైంది
ఇన్ని వాగ్దానాలు పరిష్కరించవలసిన AITUC యూనియన్ చైర్మన్ స్ట్రక్చర్ కమిటీ మీటింగ్ బహిష్కరించామని చెప్పుకోవడం సిగ్గుచేటు, ఇప్పటివరకు సింగరేణి యాజమాన్యంతో సింగరేణి లో లాభాలు ఎన్నో చెప్పించలేని స్థితిలో AITUC ఉండటం అంటే కార్మికులకు న్యాయం చేసినట్టు ఇప్పటికైనా AITUC ద్వంద వైఖరి సింగరేణి కార్మికులు అర్థం చేసుకోగలరని ఐఎన్టీయూసీగా విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు.
సింగరేణి కార్మికులకు
లాభాల వాటా శాతం ప్రకటన & పంపిణీ విషయంపై కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిని వాడుకొని కొన్ని ప్రభుత్వ వ్యతిరేక సంఘాలు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి.
కార్మికులు ఎలాంటి అపోహలు లేదా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ & INTUC రాష్ట్ర కార్యదర్శి జనరల్ శ్రీ బి. జనక్ ప్రసాద్ ఈ విషయాన్ని ఇప్పటికే సీఎండీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు శ్రీధర్ బాబు మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
రాబోయే 2–3 రోజుల్లో ప్రభుత్వమే అధికారిక ప్రకటన చేయనుంది.
అందువల్ల కార్మికులు నిశ్చింతగా ఉండాలని కృష్ణంరాజు అన్నారు .
ఈ కార్యక్రమo లో INTUC నాయకులు, దడిగల అభిలాష్, కర్రి మహేష్,కెపియుజి గని ఉద్యోగులు INTUC కార్యకర్తలు పాల్గొన్నారు..









