E-PAPER

మణుగూరులో ప్రజా సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం త్వరలో

మణుగూరు సెప్టెంబర్ 16 వై 7 న్యూస్
ఇటీవల సింగరేణి సిఎండి బలరాం నాయక్ చేసిన ప్రకటనలో సింగరేణి బొగ్గు నిల్వలు తక్కువవుతున్నందున మరో నాలుగు,ఐదు సంవత్సరాల్లో సింగరేణి మూతపడే పరిస్థితి తలెత్తవచ్చు అని వ్యాఖ్యానించడం వల్ల సింగరేణి ప్రాంత ప్రజల్లో, ఉద్యోగుల్లో, ఔట్సోర్సింగ్ కార్మికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

పినపాక నియోజకవర్గం పరిధిలో ఐటిసి, హెవీ వాటర్ ప్లాంట్, సింగరేణి, బి.టి.పి.ఎస్ వంటి నాలుగు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నప్పటికీ, ఇన్నేళ్లుగా ఈ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉండటం ఒక ప్రధాన ప్రశ్నగా మారింది.

ఈ అంశాలతో పాటు ప్రాంతీయ ప్రజాసమస్యలు, ఉద్యోగావకాశాలు, అభివృద్ధి, వైపరీత్యాలు తదితర విషయాలపై చర్చించడానికి త్వరలో మణుగూరులో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయబడుతోంది. ఈ సమావేశంలో మేధావులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని తమ విలువైన అభిప్రాయాలు పంచుకోనున్నారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి నియోజకవర్గ ప్రజాప్రతినిధులందరూ తప్పనిసరిగా హాజరై, తమ విలువైన సూచనలు ఇవ్వాలని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒకతాటిపైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఇట్లు,
పులిపాటి పాపారావు
సెల్:8317573502

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News