E-PAPER

ఇల్లు కూలిన బాధితులను ఆదుకోండి. ప్రభుత్వానికి బీజేపీ నాయకుల విజ్ఞప్తి

దమ్మపేట, ఆగస్టు 28 వై 7 న్యూస్;

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,దమ్మపేట మండలం, పార్కలగండి గ్రామం గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు పార్కలగండి గ్రామానికి చెందిన సున్నం నాగబాబు ఇల్లు కూలిపోయింది. ఈ సమాచారం తెలుసుకున్న అశ్వారావుపేట నియోజకవర్గ బీజేపీ నాయకులు తంబళ్ల రవి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,గ్రామాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్లే వర్షపు నీరు నేరుగా ఇళ్లల్లోకి ప్రవహిస్తోంది. దీనివల్ల పేద కుటుంబాలు నష్టపోతున్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి నాగబాబు కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించడంతో పాటు ప్రభుత్వ తరఫున తక్షణ ఆర్థిక సహాయం అందించాలి అని డిమాండ్ చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News