పలాస,ఆగస్టు20 వై 7 న్యూస్
ఆర్ఓబి నిర్మాణం కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేశారు. పలాస తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది.ఎమ్మెల్యే శిరీష లాటరీ సిస్టమ్ ద్వారా 90 మందికి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైల్వే నిర్వాసితులకు సూదికొండ, లేబర్ కాలనీ ప్రాంతాల్లో భూమి కేటాయించాం. రైల్వే బ్రిడ్జి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రాబోయే మార్చి నాటికి పూర్తి చేసి ప్రారంభిస్తాం అని తెలిపారు.అదేవిధంగా ఆమె, “కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ న్యాయం చేస్తుంది” అని స్పష్టం చేశారు.
Post Views: 86









