బాన్సువాడ ఆగస్టు 20 వై సెవెన్ న్యూస్
కోటగిరి మండలం యాద్గార్పూర్ గ్రామ పూజారి శివశాస్త్రి గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డు 2025 కు ఎంపికయ్యారు. తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్స్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ యువజన దినోత్సవ ముగింపు ఉత్సవాలలో భాగంగా యాద్గార్పూర్ గ్రామ పూజారి శివ శాస్త్రి ని గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డుకు ఎంపిక చేసి హైదరాబాదులోని తెలంగాణ సారస్వతపరిషద్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ఆయనకు అందజేశారు . తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ సంస్థ నిర్వహించే అవార్డుల
ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా, 2025 సంవత్సరానికి గాను గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డ్ ను పౌరోహిత్యం విభాగంలో శివ శాస్త్రి అందుకున్నారు. కోటగిరి మండలానికి చెందిన పూజారి శివ శాస్త్రి గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డుకు ఎంపిక అవ్వడంతో ఆయనను ఉమ్మడి కోటగిరి మండలం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఆయనకు అవార్డు దక్కడంతో అభినందిస్తూ శాలువా పూలమాలలతో సన్మానించి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా పూజారి శివ శాస్త్రి మాట్లాడుతూ…. గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డుకు పౌరోహిత్యం విభాగంలో ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. తాను చేస్తున్న పౌరహిత్యానికి గుర్తింపుగా తనను గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డుకు ఎంపిక చేసిన తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ సభ్యులకు, తనను ఘనంగా సన్మానించిన కోటగిరి ప్రెస్ క్లబ్ సభ్యులకు ధన్యవాదములు తెలిపారు. తాను చిన్నప్పటినుండి పౌరోహిత్యం చేయడానికి సహకరించిన యాద్గార్పూర్ గ్రామస్తులకు, తనకు వేదం నేర్పిన గురువులకు ఈ అవార్డు అంకితం అని ఆయన చెప్పారు. తనకు చిన్నప్పటినుండి సహకారం అందిస్తున్న యాద్గార్పూర్ గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులలో తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ వ్యవస్థాపకులు డాక్టర్. రాజ్ నారాయణ , ముఖ్య అతిథుతులుగా డిప్యూటీ చైర్మన్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్.బండ ప్రకాష్, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు జీ. వివేకానంద్, కోటగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, ఉపాధ్యక్షులు కృష్ణ, గౌరవ అధ్యక్షులు రాము, కోశాధికారి అనిల్, యాద్గర్పూర్ గ్రామస్తులు హనుమంతు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.









