బాన్సువాడ ఆగస్టు 20 వై సెవెన్ న్యూస్
వర్ని మండలం తదిలేపల్లి గ్రామ ప్రధాన రహదారి గుంతల మాయంగా మారి ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు పగలు రాత్రి అని తేడా లేకుండా 24 గంటల పాటు ఇసుక ట్రాక్టర్లు ఇసుక లారీలు భారీ సంఖ్యలో తిరగడం వల్ల రోడ్డు ధవసమయ్యాయి అని అనేక ఎండ నుంచి ఇసుక అక్రమంగా తరలించడం వల్ల వాటి రాకపోకల వల్ల రోడ్డు ధ్వంసం అయ్యాయని గ్రామస్తులు తెలిపారు మొక్కల లోతులో గుంతలు ఉన్నాయని వర్షపు నీటితో నిండి నదుల్లాగా కనిపిస్తున్నాయని అనేక ఇబ్బందులు కలగడమే కాకుండా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని మృత్యుకు దగ్గర అవుతున్న ఎవ్వరు పట్టించుకోవడంలేదని అన్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుక తరలించడం వల్ల రోడ్డు ధ్వంసం అవుతున్నాయి అని ప్రజలకు కంటికి కునుకు లేకుండా పోతుందని తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఎన్నిసార్లు అధికారులు చెప్పిన పట్టించుకోకపోవడం వల్ల గ్రామస్తులు అంత కలిసి ఆపివేయడం జరిగిందని అన్నారు. రోడ్లు చాలా అద్వానంగా మారిన ఎవరు పట్టించుకోవటం లేదని వీటిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.









