E-PAPER

అన్నారం గ్రామంలో దానధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో బోనాల పండుగ వైభవంగా నిర్వహణ

మణుగూరు, జూన్ 26 వై 7 న్యూస్;

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం అన్నారం గ్రామంలో నేడు బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. గ్రామస్థుల ఉత్సాహం మధ్య, దానధర్మ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు గంట రాధా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో భక్తిశ్రద్ధలతో జరిగింది.
స్వయంగా ట్రస్ట్ సభ్యులు పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పులు, కోలాటాలు, హారతులతో గ్రామ వీధులు మారు మోగిపోయాయి. మహిళల ఉత్సాహం, బాలబాలికల నృత్యాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.బోనాల పండుగను పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాలు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News