పినపాక, జూన్ 24: వై 7 న్యూస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్న రైతు బంధు పథకం కింద రైతులకు ఎకరాకు రూ.6,000 చొప్పున నిధులు జమ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆనందోత్సాహ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మంగళవారం బయ్యారం ఎక్స్ రోడ్డు కూడలిలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “రైతు సంబరాలు” నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రామనాధం నేతృత్వం వహించగా, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సంబరాల్లో భాగంగా టపాసులు పేల్చి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా రామనాధం మాట్లాడుతూ, “రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొటిగా నెరవేర్చుతోంది. రైతుల జీవితాల్లో వెలుగు నింపే దిశగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయం,” అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మండల స్థాయి నాయకత్వం, కార్యకర్తలు పాల్గొన్నారు.









