E-PAPER

భద్రాచలం కణితి సతీష్ హత్య కేసు: మరో 12 మంది నిందితులు అరెస్ట్

భద్రాచలం జూన్ 14 వై 7 న్యూస్ ;

భద్రాచలం ASR కాలనీలో తేది 07.06.2025న జరిగిన కణితి సతీష్ హత్య కేసు విచారణలో మున్ముందు పురోగతి కనిపిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు గుంజా సాయిరామ్‌ను 09.06.2025న పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.

తాజాగా, పరారీలో ఉన్న మిగిలిన నిందితుల గాలింపు చర్యల్లో భాగంగా, ఈరోజు (13.06.2025) నందు భద్రాచలం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విక్రాంత్ కుమార్ సింగ్ (I.P.S) ఆధ్వర్యంలో 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిని న్యాయస్థానంలో హాజరు పరిచారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని భద్రాచలం పోలీసు శాఖ ప్రకటించింది.

అరెస్ట్ అయిన నిందితుల వివరాలు:

1. మాగ్దం మొహినుద్దీన్ నజీర్ (21), టిఫిన్ సెంటర్, లక్ష్మీపురం, బూర్గంపాడు

2. మోటుపల్లి కామేష్ (31), డ్రైవర్, ఛప్టా దిగువ, భద్రాచలం

3. వల్లెపు సాంబ (25), వ్యాపారి, జగదీష్ కాలనీ, భద్రాచలం

4. వల్లెపు దుర్గా ప్రసాద్ @ దుర్గా (20), కూలీ, జగదీష్ కాలనీ, భద్రాచలం

5. గుండి రాకేష్ (31), డ్రైవర్, చేన్నాంపేట, ఏటపాక

6. గుంజా గోపిచంద్ @ గోపి (21), విద్యార్థి, జగదీష్ కాలనీ, భద్రాచలం

7. గోళ్ళ గణేష్ @ పండు (28), ఆటో డ్రైవర్, జగదీష్ కాలనీ, భద్రాచలం

8. చెంచాలపు రాహుల్ తేజ @ రాహుల్ (20), ఫోటోగ్రాఫర్, అశోక్‌నగర్ కొత్త కాలనీ, భద్రాచలం

9. బానోత్ మధు @ పణి కుమార్ (21), ఆటో డ్రైవర్, శ్రీరాం నగర్ కాలనీ, ఏటపాక

10. చల్లా అజయ్ (20), కూలీ, గాంధీనగర్, సారపాక

11. మోతుకురి సాయి @ సారపాక సాయి (23), ఆటో డ్రైవర్, రాజీవ్‌నగర్ కాలనీ, సారపాక

12. గుంజా వెంకటేష్ (30), ట్రావెల్స్ బస్సు టికెట్ బుకింగ్, జగదీష్ కాలనీ, భద్రాచలం

భద్రాచలం పట్టణాన్ని ఉలిక్కిపడేసిన ఈ కేసులో పూర్తి న్యాయం జరిగే వరకు పోలీసుల గాలింపు, విచారణ మరింత వేగవంతం చేయనున్నట్లు సమాచారం.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News