నాకు న్యాయం చేయమని కనిపించినవారిని అడుగుతున్నది.
జోగులంభ గద్వాల జిల్లా
జోగులంభ గద్వాల జిల్లా అయిజలో హైదరాబాద్ అమ్మాయి సుమారు 15 రోజులుగా తనను ప్రేమించి తప్పించుకు తిరుగుతున్న అబ్బాయి కొరకు తిరుగుతూ కనిపించిన వారిని నాకు న్యాయం చయండంటూ దీనంగా వేడుకుంటున్నది.వివరాలలోకి వెళితే అమ్మాయి పేరు అనూష హైదరాబాద్. హైదరాబాద్ లో డిగ్రీ చదువుతున్న సమయంలో అదే కాలేజీలో అయిజ రజక్ అనే అబ్బాయి చదువుకుంటూ ప్రేమ పేరుతో మోసం చేశాడని,అందువల్ల అతనిపై హైదరాబాద్ పోలీస్టేషన్ లో కేసు నమోదు చేయించగా అతని తరపు బంధువులు వచ్చి నీకు మా అబ్బాయికి పెళ్లి చేస్తాము బెయిల్ ఇప్పించమని అడిగారు.నేను నమ్మి అతనికి బెయిల్ ఇప్పించగా నిన్ను నేను పెళ్లి చేసుకోనంటూ ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నాడు.కాబట్టి నాకు న్యాయం చేయాలని కనిపించిన ప్రతివారిని దీనంగా అదుగుతూ కంటతడి పెట్టుకుంటున్నది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









