అన్నపురెడ్డిపల్లి , వై 7 న్యూస్;
అశ్వారావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన చైర్మన్గా నియమించిన మల్లేల నరసింహరావు ప్రమాణ స్వీకారోత్సవం ఈ రోజు ఆలయంలో ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ తో పాటు పాలకవర్గాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని నూతన చైర్మన్ నరసింహరావు సారధ్యంలో దేవస్థానం మరింత అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు కార్యక్రమానికి మండల స్థాయి ప్రజాప్రతినిధులు దేవాదాయ శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తజనసమూహం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు…









