భద్రాద్రి కొత్తగూడెం;
యువతరం పార్టీ జిల్లా అధ్యక్షులు నరేష్ నాయక్ మాట్లాడుతూ..
పాల్వంచలో కొంతమంది మద్యం షాపుల యజమానులు అందరూ కలిసి మద్యం సిండికేటుగా ఏర్పడి కొన్ని బ్రాండ్ల మద్యాన్ని వైన్ షాపుల్లో విక్రయించకుండా సిండికేట్ ద్వారా బెల్ట్ షాపులకు అధిక ధరలకు ఇస్తున్నారని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాకుండా అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్నారని గతంలో జిల్లాలో కల్తీ మద్యం తాగి ప్రాణాలు సైతం పోగొట్టుకున్న సంఘటనలు సైతం ఉన్నాయని, కల్తీ మద్యం కూడా జోరుగా సాగుతుందని,మద్యం అధిక ధరలకు అమ్ముతూ పేద, మధ్యతరగతి ప్రజల రక్తాన్ని పిలుస్తున్నారని వీటిపై చర్యలు తీసుకోవాలని గత నెల తేదీ : 08-04-2025 నాడు పాల్వంచలో ఉన్న స్థానిక అబ్కారీ పోలీస్ స్టేషన్ ఎస్సై గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఇచ్చి ఇప్పటికీ నెల రోజులు గడుస్తున్న అబ్కారీ పోలీసు వారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని యువతరం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఇప్పటికైనా అబ్కారీ పోలీసు వారు చర్యలు తీసుకోకపోతే త్వరలో యువతరం పార్టీ ఆధ్వర్యంలో అబ్కారీ పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని మీడియా ముఖంగా వారిని తెలియజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో యువతరం పార్టీ జిల్లా మహిళా నాయకురాలు తిరుపతమ్మ మరియు జిల్లా నాయకులు బలగం సురేష్, సాయి రమేష్ ,రాము, కృష్ణ బాబు, కళ్యాణ్, చంటి, నీల, సుశీల, మంగ, కైక ,బన్నీ తదితరులు పాల్గొన్నారు.









