E-PAPER

తూప్రాన్ లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర…

బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

తూప్రాన్ మార్చ్ 12 వై సెవెన్ న్యూస్

తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో గత 18 సంవత్సరాలుగా బజరంగ్దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహిస్తున్నారు హనుమాన్ జయంతి పురస్కరించుకొని శనివారం తూప్రాన్ లోని మహంకాళి దేవాలయం ఆవరణ నుండి డీజే చప్పుడులతో హనుమాన్ భక్తి గీతాలతో వినాయక్ నగర్ మీదుగా క్రింది వాడకట్టు టాకీస్ రోడ్ నర్సాపూర్ చౌరస్తాలోని శివాజీ చౌక్ మీదుగా బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.. అనంతరం చెరువు కట్ట పై వెలసిన హనుమాన్ దేవాలయం వరకు ర్యాలీగా వెళ్లి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ బైక్ ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తూప్రాన్ సిఐ రంగాకృష్ణ,, ఎస్సై సదానందం లు భారీ బందోబస్తు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బజరంగ్దళ్ నాయకులు చిన్నల్లింగ్ కార్తీక్ గౌడ్, బిజెపి నాయకులు తాటి విట్టల్ అంజా గౌడ్ రాముని గారి మహేష్ గౌడ్, మున్సిపల్ శాఖ అధ్యక్షులు భూమన్న గారి జానకిరామ్ గౌడ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి పోతరాజు నాగరాజు , మాసాయిపేట సురేష్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మన్న సాయి ముదిరాజ్ ,మాజీ మండల పార్టీ అధ్యక్షులు సిద్ధ రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News