హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు
కాల్వ ద్వారా నీటి పారుదల ను పరిశీలించిన ఉమ్మన్నగారి భాస్కర్ రెడ్డి
తూప్రాన్, ఏప్రిల్, 11. వై సెవెన్ న్యూస్
కెనాల్ కాల్వల ద్వారా నుండి సాగు నీరు వచ్చే సోర్సెస్ ఉండడంతో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చొరవ తీసుకొని నీటి పారుదల శాఖ జేఈ, డీఈ, లతో మాట్లాడి రైతులకు సాగు నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కాల్వ వెంట సాగునీరు ఎక్కడి వరకు వచ్చిందని పరిశీలించారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులు ఉమ్మనగారి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మల్కాపూర్ గుండ్రెడ్డిపల్లి రైతులు తమ సొంత డబ్బులు నాలుగు లక్షలు పోగు చేసుకుని వరి పొలాలు ఎండిపోతున్నందున కాల్వ మరమ్మతులు అర్ధాంతరంగా ఉండడంతో రైతుల డబ్బులతో రాళ్లు రప్పలు మట్టి జెసిపి హిటాచిలతో తీసివేయాగా మల్కాపూర్ లో చెరువు కుంటలు గురువారం రోజు వరకు నిండాయి. తద్వారా గుండ్రెడ్డిపల్లి చెరువులోకి వాటర్ రావడం జరుగుతుందనీ భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు హర్షించదగ్గ విషయం ఈ వాటర్ ఎక్కడి వరకు వచ్చాయని ఫారెస్ట్ లో మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి సేవాదళ్ కిష్టారెడ్డి యాదిరెడ్డి కృష్ణ రామ్ రెడ్డి రాములు ఆంజనేయులు మహేష్ రమేష్ స్వామి వీరందరూ గురువారం వెళ్లి పరీశించారు.









