E-PAPER

కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయండి

అర్హులైన ప్రతి ఒక్కరికి
న్యాయపరమైన స్కిల్ మాట్రిక్స్ అమలుపరచండి

యాజమాన్యం రాజు లాంటిది తలుచుకుంటే కార్మికుల భవిష్యత్తును మెరుగుపరుస్తుంది

కంపెనీ అభివృద్ధిలో కాంట్రాక్టు కార్మికులు కీలక పాత్ర పోషిస్తుంటారు

కార్మికుల శ్రమను గుర్తిస్తే దానికి తగిన ప్రతిఫలాన్ని చూపిస్తారు

బూర్గంపాడు, మార్చి 27 వై 7 న్యూస్;

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండల పరిధి సారపాక గ్రామం లోగల ఐటీసీ పరిశ్రమలో ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు సింగమనేని ప్రసాద్, గౌరవ సలహాదారు తన్నీరు వెంకటేశ్వర్లు, కాంట్రాక్టు కార్మికుల ప్రధాన కార్యదర్శి షేక్ జహూర్, సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాయల నవీన్, ల ఆధ్వర్యంలో ఐటిసి హెచ్ ఆర్ మేనేజర్ చాంద్ పాషా కి మెమోరాండం అందజేయడం జరిగినది. ఇటీవల కాలంలో స్కిల్ మ్యాట్రిక్స్ అమలుపరిచారు. స్కిల్ మాట్రిక్ అమల్లో అనేక అవకతవకలు జరిగాయని చాలామంది అర్హులైన వారికి స్కిల్ మాట్రిక్స్ అందని ద్రాక్ష ల మారిందని సింగమనేని ప్రసాద్ వాపోయారు. యాజమాన్యం రాజు లాంటిది అలాంటి యాజమాన్యం తలుచుకుంటే అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలరని ఆయన అన్నారు. ఇటీవల కాలంలో అమలైన స్కిల్ మాట్రిక్స్ లో అర్హులైన చాలామంది కార్మికుల పేర్లు లేకపోవడంతో వారి శ్రమకి తగిన ఫలితం అందట్లేదని కన్నీరు మున్నీరు అవుతున్నారు అని ఆయన వాపోయారు. ప్రొడక్షన్ వృద్ధి చేయడంలో కాంట్రాక్టు కార్మికులు అధిక శాతంలో కీలక పాత్ర పోషిస్తారని ఆయన యాజమాన్యానికి మరొకసారి గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి స్కిల్ మాట్రిక్ అమలు చేస్తే వారు ఆనందంతో రెట్టింపు ఉత్సాహంగా పనిచేస్తూ కంపెనీ ప్రొడక్షన్ పెంచుతూ మరింత ఆదాయాన్ని చేకూర్చే విధంగా అడుగులు వేస్తారని ఆయన తెలియజేశారు. కార్మికుల శ్రేయస్సు కోసం ఏఐటిసి ముందుంటుందని వారి మంచి కోసం ఏం చేయడానికి అయినా వెనుకాడ పోమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కమ్యూనిస్టు పార్టీ కార్మికుల కష్టం నుండి పుట్టినదని వారి శ్రమను యాజమాన్యం గుర్తించాలి లేనిపక్షంలో కార్మికుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఐటియుసి గౌరవ అధ్యక్షుడు సింగమనేని ప్రసాద్, గౌరవ సలహాదారు తన్నేరు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు కోటమర్తి శ్రీనివాస్, స్వామి గౌడ్, ఎండి సాజిద్ కాంట్రాక్టు కార్మికుల ప్రధాన కార్యదర్శి షేక్ జహూర్, సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాయల నవీన్, జాయింట్ సెక్రటరీలు అనిల్ శర్మ, ఉపేందర్, గౌతమ్, నాగరాజు, తోకల నరేష్ కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యులు స్వచ్ఛందంగా వచ్చిన కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!