E-PAPER

పెద్దవంగర మండల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న యశస్విని ఝాన్సీ రెడ్డి

తొర్రూరు, నవంబర్ 12 వై7 న్యూస్

తొర్రూరు పట్టణంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ హాల్ లో ఏర్పాటు చేసిన పెద్దవంగర మండల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న యశస్విని ఝాన్సీ రెడ్డి

పెద్దవంగర మండల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసిన బ్లాక్ మరియు మండల అధ్యక్షులు, అదేవిదంగా వివిధ గ్రామాలనుండి విచ్చేసిన గ్రామ పార్టీ అధ్యక్షులకు, పార్టీ ముఖ్య నాయకులకు, యూత్ నాయకులకు, మహిళ నాయకులకు, సోషల్ మీడియా మిత్రులకు, పార్టీ కార్యకర్తలకు ఎంమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి నమస్కారాలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని అబద్ధపు ప్రచారాలు చేస్తూ పార్టీపై మరియు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరిగే సమాధానం ఇవ్వాలన్నారు. అందుకు మీ గ్రామంలో ఉన్న సోషల్ మీడియా కోఆర్డినెటర్లను ప్రోత్సహించండి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.గత ఎన్నికల్లో మహిళల పాత్ర చాలా కీలకం, ఈసారి లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందాలంటే మహిళలు కీలక పాత్ర పోషించాలి, అందుకు గ్రామస్థాయిలో ఉన్న మహిళా నాయకులను ప్రోత్సహించండి, పార్టీ బలోపేతానికి కృషి చేయండి అని చెప్పారు.

పాలకుర్తి నియోజకవర్గం లో యూత్ కు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారని పక్క నియోజకవర్గాలో ఉన్న నాయకులు చెప్తున్నారు,
ఆ విషాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేస్తూ రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థుల గెలుపులో మీ పాత్ర చాలా కీలకంగా మారాలని తెలియపరిచారు.కాంగ్రెస్ పార్టీ కోసం మీరు చేస్తున్న త్యాగాలు చూపిస్తున్న ఆదరణ ఇలాగే కొనసాగించాలని.. రాబోయే పాలకుర్తి నియోజకవర్గం లో గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చూపిన విధంగా విజయడాంక మోగించి, తొర్రురూ మండలంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపుకై ప్రతి కార్యకర్త సైనికున వలె నిలబడాలని, ఏ కష్టం వచ్చిన మీ వెంట మేము ఉంటామని,
కొత్త పాత తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలని తెలియపరుస్తున్నాను.అదే విధంగా గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇస్తూ, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం లో నాయకత్వం దిశ నిర్దేశం చేసుకుంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.అదేవిధంగా ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చారిత్రాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే కులగనణ ఎట్టకేలకు రాష్ట్రంలో ప్రారంభమైంది కులగనణ అనేది బడుగు బలహీన వర్గాల ప్రజలకు అత్యంత ప్రాధాన్యలతో కూడిన అంశం.
ఏఐసీసీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు ఎన్నికల సమయంలో కుల గణనపై ఖచ్చితమైన హామీ ఇచ్చారు కులగనన చేపట్టి ఆయా కులాల జనాభాను బట్టి రిజర్వేషన్లు కూడా పెట్టి సామాజిక న్యాయాన్ని సంపూర్ణంగా అమలు చేస్తామని కచ్చితంగా హామీ ఇచ్చారు, కులగనన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టింది 85 వేల మంది ఉద్యోగస్తులతో 06 తేదీ నుంచి కులగననకు రంగంలోకి దిగింది, కులగనను దేశానికి ఆదర్శంగా రోల్ మోడల్ గా తెలంగాణ కులగనణ ఉండాలని అన్ని రకాల చర్యలు చేపట్టాం.ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ప్రతిపక్ష పార్టీల కుట్రను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలి, అలాగే గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని స్థాయిలలో నాయకులు కులగనణ సర్వేలకు పూర్తిగా సహకారం అందించాలి, అటు ప్రజలలో చైతన్యం చేయడంతో పాటు రాజకీయ కుట్రలను తిప్పికొడుతూ కులగరణ ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలి.నవంబర్ 5వ తేదీన హైదరాబాద్ గాంధీయన్ నాలెడ్జ్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో మన రాహుల్ గాంధీ గారు చెప్పిన అంశాలను ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాలి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క , క్యాబినెట్ మంత్రుల ఆమోదంతో ప్రతిష్టాత్మకమైన తీసుకున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటికి ప్రభుత్వ ఎన్యుమలెటర్స్ తో మీరు కూడా వెళ్లి ప్రజలకు అవగాహన అందిస్తూ, ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్న నివృత్తి చేసి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకొచ్చేలా పని చేయాలని విజ్ఞప్తి చేశారు

నవంబర్ 06 తారీకు నుండి ఇంటింటికి సమగ్ర కులగనణ హౌస్ లిస్టింగ్ మరియు సర్వే చేయడం ప్రారంభించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల మంచి కోసం తీసుకున్న ఈ కార్యక్రమంలో మీరు ప్రతి గ్రామంలో కార్యకర్తలు పాల్గొనేలా చేయాలని ఆదేశిస్తూ.. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడిగి తెలుసుకోవాలన్నారు.అదేవిధంగా నవంబర్ 20వ తారీకు దాకా జరిగే ఈ సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదములు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ మరియు మండల అధ్యక్షులు మండల ముఖ్యనాయకులు, వివిధ గ్రామపార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యూత్ నాయకులు, సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు..

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News