వర్గీకరణ ను అడ్డుకోవడం కోసం చట్ట పరిధిలో ఉద్యమిస్తాం
మాలమహానాడు జాతీయ అధ్యక్షులు
డా.పసుల రాంమూర్తి
ములుగు,అక్టోబర్21 వై 7 న్యూస్;
మాలమహానాడు ముఖ్య నాయకుల సమావేశం ములుగు జిల్లా కేద్రం ఉల్లేరావు శ్రవణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంనకు ముఖ్య అతిదిగా జాతీయ అధ్యక్షులు డా పసుల రాంమూర్తి హాజరు అయి మాలల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాటం చేస్తామన్నారు. ములుగు స్థానిక అడ్వకెటు లతో మాలల పైన ఉన్నటు వంటి కేసుల పరిస్కారం కోసం చర్చ చేశామన్నారు త్వరలో జిల్లా నూతన కమిటీ వేసి అన్ని మండల గ్రామ కమిటీలు వేస్తామన్నారు వర్గీకరణ పై సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగానికి విరుద్దంగా ఉంది అన్నారు ఇప్పటి వరకు జడ్జి ఇంటికి ఏ ప్రధాన మంత్రి పోలేదని అన్నారు కానీ జస్టిస్ చంద్రచుడ్ ఇంటికి ప్రధాని మోడీ వెళ్లి వినాయక చవితి పూజలో పాల్గొన్నారు అని అన్నారు చంద్ర చూడు జడ్జి మంద క్రిష్ణ మాదిగ ను కూడ కలువడం చట్ట విరుద్ధం అన్నారు ఈ కార్యక్రమం లో రాజమళ్ళ సుకుమార్ మన్నె కరుణాకర్ అడ్వాకెట్ దాసండ్ల సుధాకర్ అడ్వాకెట్ మంద విజయ్ కుమార్ అడ్వాకెటు కర్నె ప్రణయ్ ప్రసాద్ అడ్వాకెట్ ముప్పిడి వెంకటేశ్వర్లు బోయ రాజేందర్ సుడిది ఐలయ్య సుధామళ్ళ మల్లయ్య రామ్ రాజేష్ ఊళ్లేరావు జంపాల్ సుధామళ్ళ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.









