E-PAPER

ఆర్థిక సాయం చేసిన జయప్రకాశ్

జోగుళాంబ గద్వాల,అక్టోబర్12 వై 7 న్యూస్;

తెలంగాణ రాష్ట్రo జోగుళాంబ గద్వాల జిల్లా,అలంపూర్ నియోజక వర్గం లోని రాజోలి మండల కేంద్రము లోని ఆర్ డి టి కాలనీ లో నూతనంగా నిర్మిస్తున్న ఎం బి చర్చి నిర్మాణం కోసం రాజోలి ఎం బి ఫీల్డ్ అసోసియన్ ఛైర్మన్ రెవ. ఆర్ పి జయప్రకాష్ ఆర్థిక సాయం అందజేశారు. రాజోలి ఎం బి చర్చి సంఘ పెద్దలు, నిర్మాణపు కమిటీ పెద్దలు కర్నూల్ లో ఉన్న రాజోలి ఎం బి పోలసమాజం అధ్యక్షులు రెవ. ఆర్ పి జయప్రకాష్ గారిని కలిసి చర్చి నిర్మాణం గురించి వారికి వివరించారు. చర్చి నిర్మాణం కోసం తన వంతు సాయంగా 30000 ముప్పై వేల రూపాయలు ఇచ్చారు. ఈ కార్యక్రమం లో కమిటి పెద్దలు విజయ్ కుమార్, ఆశీర్వాదం, సుందర్ రాజు, కృష్ణ, మోషే, నాగరాజు, నడిపెన్న, ఇర్మియా, మార్కు, ఖాజన్న, కోర్నెలి,తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :