E-PAPER

మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్

ఖమ్మం,అక్టోబర్11 వై 7 న్యూస్;

ఖమ్మం లో వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 21వ డివిజన్ పార్శి బంధం లో బతకమ్మ సంబరాలు, దేవి నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం నాడు మహార్నవమి సందర్భంగా పెద్ద ఎత్తున మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఉత్సవ కమిటీ అధ్యక్షులు బిజెపి వన్ టౌన్ అధ్యక్షులు పిల్లలమర్రి వెంకట్, మారం శ్రీకాంత్, మంద నరేష్, మాణిక్యాల విప్లవ్, కటకం శ్రీనివాసరావు మల్లి బాబు యాదవ్ కు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ దేవీ నవరాత్రులు, వినాయక ఉత్సవ కార్యక్రమములు హిందువుల యొక్క ఐక్యతను, ఎప్పటికప్పుడు గుర్తు చేయడానికి దోహదపడుతుందని, అమ్మవారి దయవల్ల ప్రతి ఇంటిలో సుఖ సంతోషాలు వర్ధిల్లాలని కోరుకుంటున్నాని తెలిపారు. గత 22 సంవత్సరాలుగా పార్శీ బంధంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నామని, తొలిసారి దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నామని, ఇలాంటి కార్యక్రమాల వల్ల సనాతన హిందూ ధర్మం సంరక్షించ పడుతుందని ఈ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని పిల్లలమర్రి వెంకట్ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉదారపు సాయి, ఉదారపు వీరభద్రం, ఉదా రపు ఉపేందర్, వెంకటరమణ వంశీ, దాసరి ఉదయ్, మాటేటి రాము, ఉదారపు బాల వెంకట్, నాగరాజు, కిషోర్, ఉప్పలయ్య, మిరియాల పరశురాం, గుగ్గిళ్ళ వెంకటాచారి, శీలం నాగరాజు, , బద్దల వీరబాబు, బంది చోడు నరేష్ , శీలం పుల్లయ్య మరియు ఉత్సవ కమిటీ సభ్యులు పెద్దలు భక్తులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News