E-PAPER

సీఎం రేవంత్ రెడ్డి దివ్యాంగులకు తక్షణమే 6 వేల ఫించన్ ఇవ్వాలి

. లేదంటే త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం

. జై స్వరాజ్ పార్టీ అధినేత కేఎస్ఆర్ గౌడ

హైదరాబాద్,అక్టోబర్05 వై 7 న్యూస్;

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు తక్షణమే 6 వేల రూపాయల ఫించన్ ఇవ్వాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు నెలకు ఆరు వేల రూపాయల ఫించన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినా ఇంకా ఫించన్ పెంచకపోవడం సీఎం రేవంత్ అలసత్వానికి నిదర్శనం అని కేఎస్ఆర్ గౌడ అన్నారు. హైదరాబాద్ నగరంలోని మెట్టు గూడలో ఉన్న జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు దివ్యాంగుల సమస్యలపై పార్టీ నాయకులు చర్చించారు. ఈ సమావేశంలో దివ్యాంగుల సమస్యలపై పోరాడుతున్న పలువురు నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలో సుమారు పన్నెండు లక్షల మంది వరకు దివ్యాంగులు ఉంటారని, సమాజంలో అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న వర్గమేదైనా ఉన్నదంటే అది దివ్యాంగులేనని, వీరికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా మాట్లాడిన కేఎస్ఆర్ గౌడ అన్నారు. సీఎం రేవంత్ వెంటనే దివ్యాంగులకు నెలకు ఆరు వేల రూపాయల వంతున ఫించన్లు ఇవ్వాలని, అదే విధంగా గడిచిన పది నెలలకు కూడా ఆరు వేల రూపాయల వంతున ఫించన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిచో త్వరలో తాము దివ్యాంగులతో కలిసి కార్యాచరణ చేపడుతామని కేఎస్ఆర్ గౌడ హెచ్చరించారు.

జై స్వరాజ్ పార్టీ దివ్యాంగుల విభాగం ఆవిర్భావం

జై స్వరాజ్ పార్టీ దివ్యాంగుల రాష్ట్ర కమిటీని వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న నాయకులతో కాసాని శ్రీనివాసరావు గౌడ ఈ సందర్భంగా ప్రకటించారు. రాష్ట్ర కమిటీ కన్వీనర్ గా రమావత్ కృష్ణ నాయక్, కో కన్వీనర్లుగా వినయ్, రమావత్ శంకర్ నాయక్, రాచమల్ల మల్లేష్ లను ప్రకటించారు. అలాగే ఈ కమిటీకి అడ్వైజర్ గా భారత ప్రభుత్వ జాతీయ యువజన అవార్డు గ్రహీత, దివ్యాంగుల హక్కుల పోరాట నాయకుడు నండూరి రమేష్ ను నియమించారు. ఈ కార్యక్రమంలో జై స్వరాజ్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ ఎస్ జే థామస్, జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గోలుకొండ రత్నం, రాష్ట్ర కార్యదర్శి మాటూరి కృష్ణ మోహన్, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News