మాల మహానాడు జిల్లా అధ్యక్షులు అల్లాడి పౌల్ రాజ్ డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో నివాసముంటున్న కోడి రెక్కల స్వప్న అనే దళిత మహిళ ను అదే గ్రామానికి చెందిన కరకగూడెం నమస్తే తెలంగాణ విలేకరుగా పనిచేస్తున్న ప్రవీణ్ గౌడ్ అనే వ్యక్తి ప్రతినిత్యం ఫోన్లు చేస్తూ వేధించేవాడు అంతేకాకుండా నేను విలేకరిని అంటూ మానసికంగా శారీరకంగా నానా రకాలుగా ఆమె ఇబ్బంది పెడుతూ ఆమెను బెదిరింపులకు గురి చేస్తూ మనోవేదనకు గురి చేశాడు. అంతేకాకుండా ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ అవమానం భరించలేక స్వప్న అనే దళిత యువతి ఆత్మహత్యాయత్నం చేసి ఈరోజు మరణించింది. ఇలాంటి దుర్మార్గమైన విలేకరిపై కచ్చితంగా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని మాల మహానాడునుంచి డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో దళిత సంఘాల అందరిని ఏకం చేసి దశలవారు ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తున్నాం..









