బీర్కూర్ ,సెప్టెంబర్ 10 వై 7 న్యూస్
బీర్కూర్ కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. దీనికోసం ట్రాన్స్కో అధికారులు ఒకవైపు విద్యుత్ స్తంభాలు తొలగిస్తున్నారు, మరొకవైపు మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా రాకపోవడంతో, తాగునీటి శాఖ అధికారులు మంచినీటి రక్షిత పథకాల కోసం నీటిని అందించడానికి ప్రత్యేకంగా పైప్ లైన్ నిర్మాణం చేపడుతున్నారు. కాంట్రాక్టర్కు, అధికారులకు మధ్య సమన్వయం లోపం బీర్కూర్ ప్రజలకు శాపంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అశ్రద్ధ కారణంగా బీర్కూర్ శ్రీరామ ఆలయం వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి నీరంతా ఆలయం పైకి వరకు పొంగి పొర్లాయి. దీనివల్ల ప్రతిరోజు మండల కేంద్రంలో మిషన్ భగీరథ నీళ్లు అందక ప్రజలు మంజీరా నది నీటిని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంగళవారం ఉదయం రామాలయ వద్ద మిషన భగీరథ పైప్ లన్ పగిలి నీరు అంతా రోడ్డుపై ప్రవహించడంతో ప్రజలు, ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు విస్తరణ పనులు ఏమో గాని పైపులైను లీకేజీ అయిందా లేక ఎవరైనా చేసి ఉంటారా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఈ రోడ్డు విస్తరణ పనుల లో భాగంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.









