. న్యూడెమోక్రసీ నాయకుడు ముసలి సతీష్
చర్ల,సెప్టెంబర్10 వై 7 న్యూస్;
చర్ల మండలం లింగాపురం పంచాయతీలో రేషన్ బియ్యం అమ్ముకుంటున్న సెల్స్ మెన్ నీ తక్షణమే సస్పెండ్ చెయ్యాలనీ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మండల రెవెన్యూ అధికారి శ్రీనివాస్ ని డిమాండ్ చేశారు.
కే వై సి చేపించు కుంటేనే బియ్యం ఇస్తా లేదంటే బియ్యం ఇవ్వమని ప్రజలతో ఇష్టాను సారంగా ప్రవర్తిస్తు లింగాపురం పంచాయతీలో 50%మంది రేషన్ బియ్యం అమ్ముకుంటున్నాడు
గిరిజన స్టోర్ లో బియ్యం కోసం వస్తున్న ప్రజలతోనే బియ్యం బస్తాలు బయటకి తెప్పించి బియ్యంకాట కూడా వారితోనె పెట్టిస్తున్నారని వారు అన్నారు. లింగాపురం పంచాయతీ బియ్యం తినని వారు ఎవరైనా ఉంటే కేజీ బియ్యం 10,రూపాయలకే కొంటానని ప్రజలదగ్గర కొంటున్నాడు. కావున తక్షణమే లింగాపురం పంచాయతీ సేల్స్ మెన్ నీ సస్పెండ్ చెయ్యాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ప్రభుత్వాలు ఏ అంశాలు లేకుండా రేషన్ బియ్యం ఇస్తున్నామని చెప్పి ప్రభోగాలు పలుకుతున్నారు ఎటువంటి అంశం లేకుండా కేవైసీ లేకుండా లింగాపురం ప్రజలకు రేషన్ బియ్యం ఇవ్వాలని చెప్పి తక్షణమే లింగాపురం పంచాయతీలో ఉన్న సేల్స్ మెని సస్పెండ్ చేసి కొత్త సేల్స్ మెన్ నీ లింగాపురం పంచాయతీలో ఏర్పాటు చేయాలని కోరుతున్నాం లేనియెడల లింగాపురం పంచాయతీ ప్రజలతో ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిద్ధి జానకమ్మ, పాముల అమరావతి ,జక్కా అనసూర్య, కట్ట కళావతి, మైప కుమారి, జెట్టి కమల, సిద్ధి ,సరోజన ,తడికల రాంబాబు, కొంగూరు సోమన్న తదితరులు పాల్గొన్నారు









