E-PAPER

త్రివేణి పాఠశాలలో గురుపూజోత్సవ వేడుకలు

పాల్వంచ,సెప్టెంబర్05 వై 7న్యూస్;

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ త్రివేణి పాఠశాలలో ఘనంగా జరుపుకున్న గురుపూజోత్సవ వేడుకలు స్థానిక పాల్వంచ పట్టణంలోని దమ్మపేట సెంటరులో గల త్రివేణి పాఠశాలలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ప్రిన్సిపాల్ మరియు కిడ్స్ ఇంచార్జ్ జి.కవిత, డా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలాంకరణ చేసి ఘనంగా మననం చేసుకున్నారు.పాఠశాలలోని విద్యార్థులతో స్వయం పాలనా దినోత్సవాన్ని జరిపి చిన్నారి విద్యార్ధిని విద్యార్థులకు బహుమతుల ప్రధానం చేసారు.పాఠశాలలోని ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులకు సత్కారాలు చేసారు.సమాజంలో గురువుజ్ఞానం ఉందని, విద్యార్థులకు చదువు గొప్పదని, జ్ఞాన విషయాలను బోధించే గురువులకు ప్రతిక్షణం గౌరవం ఇవ్వాలి అని చక్కగా వివరించారు.ఈ కార్యక్రమన్ని ఉద్ధేశించి పాఠశాల డైరెక్టర్
జి.వీరేంద్రచౌదరి , మురళీకృష్ణ పాఠశాలలోని ఉపాధ్యాయులు అందరికి గురుపూజాోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమములో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సహోద్యోగులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :