. కమర్షియల్ వ్యాపారస్తులకు ముందుగానే సమాచారం ఇచ్చారు అనేది నిజమేనా!?
. రేషన్ బియ్యం సబ్సిడీ గ్యాస్ పక్కదారి పట్టడానికి కీలక పాత్ర వారిదే అంటూ ఆరోపణలు
. ఏ కమర్షియల్ వ్యాపారమైన డొమెస్టిక్ సిలిండర్ వినియోగిస్తున్న వైనం
. రేషన్ డీలర్ షాపులోనే సబ్సిడీ బియ్యం కొనుగోలు చేస్తున్న పందికొక్కులు
. పౌర సరఫరాల శాఖ అధికారుల విధులపై ఫోకస్ పెట్టని జిల్లా కలెక్టర్
. పత్రికా కథనాలకు విలువలు ఉన్నట్టా!? లేనట్టా!?
పినపాక,ఆగస్టు30 వై 7 న్యూస్;
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్న సంబంధిత అధికారుల పని తీరు మాత్రం మారడం లేదు అనేది జగమెరిగిన సత్యంమే ఒకపక్క అవినీతికి అలవాటు పడిన ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి నిరోధక యంత్రాంగం విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇప్పటికే అనేక ప్రభుత్వ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు చేపట్టి అనేకమంది అవినీతి చేపలను పట్టుబడుతుంది. మరోవైపు దొరికిన వాడే దొంగ మేము తెలివిగా ఉన్నాము అనుకునేవారు ముడుపులు లేనిదే ముద్ద నోట్లోకి దిగదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పనిచేసే పత్రికలు అక్రమాలు జరుగుతున్నాయనే సమాచారాన్ని పత్రికా ముఖంగా తెలియజేసిన కనీసం ప్రభుత్వ ఉద్యోగుల్లో చలనం కనిపించడం లేదు అనే ఆరోపణలు కూడా గట్టిగానే ఉన్నాయి. ఎక్కడ చూసినా పేదలకు అందవలసిన రేషన్ బియ్యం సబ్సిడీ గ్యాస్ పక్కదారి పడుతుంది అంటూ అనేక పత్రికలు కథనాలు రాసినా సంబంధిత పౌర సరఫరాల శాఖ అధికారులు కానీ రెవిన్యూ అధికారులు కానీ గౌరవ జిల్లా కలెక్టర్ సైతం స్పందించి సరైన తనిఖీలు చేపట్టడం లేదు అంటూ నియోజకవర్గంలో ప్రజల నుండి సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లో పేదలకు అందవలసిన సబ్సిడీ గ్యాస్ డొమెస్టిక్ సిలిండర్లు ఎక్కడ చూసినా కమర్షియల్ వ్యాపారస్తుల చెంతకు చేరుతున్నాయి. హోటల్స్, బిర్యానీ సెంటర్స్ ,టిఫిన్ సెంటర్స్, వెల్డింగ్ షాప్స్, మినీ గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్స్, వ్యాపారం ఏదైనా వినియోగించేది కేవలం డొమెస్టిక్ సిలిండర్ మాత్రమే అనేది జగమెరిగిన సత్యమే. నియోజకవర్గంలో ఉన్న అభిరామ్ గ్యాస్ ఏజెన్సీ శ్రీ సాయి గ్యాస్ ఏజెన్సీ ప్రైవేటు వాహనాల మాటున డొమెస్టిక్ సిలిండర్లు కమర్షియల్ వ్యాపారాలకు తరలిస్తున్నారు అంటూ గత రెండు నెలలుగా పత్రికలు కథనాలు రాస్తున్నాయి. ప్రభుత్వ సబ్సిడీ పథకాలు కాపాడవలసిన అధికారులు కనీసం స్పందించకపోగా ఆకస్మిక తనికిలకు వచ్చే పౌర సరఫరాల శాఖ అధికారులు ముందే వ్యాపారస్తులకు సమాచారం అందించి తనిఖీలు నిర్వహిస్తున్నారు అంటూ ప్రజలు గుసగుసలాడుతున్నారు. దానితో పేద ప్రజలకు అందవలసిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు ప్రతిరోజు వ్యాపారస్తుల చెంతకు చేరుతున్నాయి అంటూ మేధావులు చర్చించుకుంటున్నారు. అదేవిధంగా పేదలకు అందవలసిన సబ్సిడీ రేషన్ బియ్యం రేషన్ డీలర్ షాపులోనే బియ్యానికి బదులుగా కేజీకి ₹10 చొప్పున వినియోగదారులకు డబ్బులు ఇస్తున్నారనే గుసగుసలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. పేద ప్రజలకు అందవలసిన సబ్సిడీ బియ్యం సబ్సిడీ గ్యాస్ కాపాడవలసిన పౌరసరఫరాల శాఖ అధికారులు అక్రమ వ్యాపారాలకు అండగా ఉంటున్నారనే సంచలన ఆరోపణలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. పౌర సరఫరాల శాఖ అధికారుల విధులు అంతంత మాత్రమే ఉన్నాయి అంటూ పత్రికలు కథనాలు రాసిన కనీసం జిల్లా కలెక్టర్ సైతం స్పందించే అవకాశాలు కనిపించడం లేదు అంటూ మేధావులు గుసగుసలాడుతున్నారు. దానితో అవినీతికి అలవాటు పడిన ప్రభుత్వ ఉద్యోగులు ఏదో ఒక సాకుతో తమ నెలసరి ముడుపులు అందుకుంటున్నారు అనే సమాచారం ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ స్పందించి పేదలకు అందవలసిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా నియోజకవర్గంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.









