కామారెడ్డి జిల్లా ,బాన్సువాడ నియోజకవర్గం
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జూలై 30న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లాలోని గ్రామపంచాయతీ వర్కర్స్ సిబ్బంది కార్మికులు అందరూ వేలాది గా పాల్గొని జయప్రదం చేయాలని కామారెడ్డి జిల్లా కమిటి జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకట్ గౌడ్, జిల్లా అద్యక్షులు బాలనర్సు తెలిపారు. గతంలో రాష్ట్రప్రభుత్వం పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పంచాయతీ కార్మికులను అందరినీ పర్మినెంట్ చేయాలని స్పెషల్ స్టేటస్ కల్పించాలని వేతనాలు పెంచాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని పిఆర్సి లో గ్రామపంచాయతీ కార్మికులను కూడా చేర్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు ఇవ్వాలని జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలను సవరించి ఇవ్వాలని కోరుతూ వెంటనే ఇతర 11 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంటే జులై 30 మంగళవారం న చలో హైదరాబాద్ కార్యక్రమం ఉన్నది కాబట్టి కామారెడ్డి జిల్లాలోని ప్రతి మండలం నుండి ప్రతి గ్రామం నుండి వందలాదిగా హైద్రాబాద్ తరలిరావాలని ఇంద్ర పార్క్ వద్ద జరిగే మహాధర్నా ను అందరూ జయప్రదం చేయాలని అన్నారు. మన









