సరూర్ నగర్ మండలం ఎన్టీఆర్ నగర్ లోని ఖిలా మైసమ్మ దేవాలయంలో పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి సీతక్క . ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ బోనాల పండుగను అత్యంత వైభవంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు. బోనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్ల నిధులను కేటాయించిందని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడేలా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రజలపై ఆ దేవతల దీవెనలు మెండుగా ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని కోరారు.
Post Views: 197









