శర్వానంద్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. మొదటి నుంచి ఆయన ఎంచుకుంటూ వచ్చిన కథలు .. పాత్రలు అందుకు కారణం అని చెప్పాలి. అడపాదడపా శర్వానంద్ మాస్ ఆడియన్స్ మనసులు గెలవడానికి తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అలా ఆయన చేసిన మరో సినిమానే ‘భోగి’. శర్వానంద్ జోడీగా అనుపమా పరమేశ్వరన్ నటించిన మరో సినిమా ఇది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది.
అది ‘ఆదిలాబాద్’ పరిధిలోని ‘బొగ్గులగుట్ట’ అనే ప్రాంతం. అక్కడ కొంతమంది గిరిజనులు నివసిస్తూ ఉంటారు. అక్కడే ‘గంగ’ (శర్వానంద్) ఐదుగురు చెల్లెళ్లతో కలిసి నివసిస్తూ ఉంటాడు. కొలిమి పనులు చేసే ‘గంగ’కి చెల్లెళ్లు అంటే ప్రాణం .. అన్నయ్యే ఆ చెల్లెళ్లకు సర్వం. ‘గంగ’ ఇంటికి ఎదురుగానే ‘సులోచన’ (అనుపమా పరమేశ్వరన్) నివసిస్తూ ఉంటుంది. మోదుగు ఆకులను విస్తళ్లుగా కుట్టేసి అమ్ముతూ ఉంటుంది. గంగ – సులోచన ఇద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు.
‘బొగ్గుల గుట్ట’లోని వాళ్లంతా ‘పటేల్’ (శరత్ లోహితస్య) కనుసన్నలలో బ్రతుకుతుంటారు. ఆయన చేతిక్రింద బలమైన అనుచర వర్గం పనిచేస్తూ ఉంటుంది. పటేల్ ఇలాకాలో అడుగుపెట్టడానికి మంత్రులు సైతం ఆలోచన చేస్తుంటారు. అంతగా ఆయన రాజకీయాలను సైతం ప్రభావితం చేస్తుంటాడు. అమావాస్య రోజులలో .. రాత్రివేళలో కన్నెపిల్లలు మాయమవుతూ ఉంటారు. అలాంటి అమ్మాయిలను గురించి ఆ మరుసటిరోజు ఊళ్లో వాళ్లెవరూ మాట్లాడుకోకపోవడం విచిత్రం.
‘బొగ్గుల గుట్ట’ ఊరు నుంచి కన్నెపిల్లలు మాయమవుతున్న విషయం ‘గంగ’ దృష్టికి వస్తుంది. అందుకు కారణం ‘నరబలి’ అనే సంగతిని అతను గమనిస్తాడు. ఇకపై నరబలి జరగకుండా చూడాలని బలంగా నిర్ణయించుకుంటాడు. అసలు నరబలికి ఎవరు పాల్పడుతున్నారు? దేనిని ఆశించి నరబలి చేస్తున్నారు? ఈ దుర్మార్గం వెనుక గల ప్రధానమైన ఉద్దేశం ఏమిటి? దీని వెనుకున్న సూత్రధారులు ఎవరు? అది తెలుసుకున్న గంగ ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది మిగతా కథ.
ఒకప్పుడు దొరలు .. దొరవార్లు .. పట్వారీల కాలం నడిచింది. వారి పెత్తనం నడిచిన కాలంలో అమాయకులైన గిరిజన ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో బలంగా ఉన్న మూఢ విశ్వాసాలకు కూడా గిరిజనులే ఎక్కువగా బలైపోయారు. అలా ‘గడీ’ పాలనను నడిపిస్తున్న ఒక పటేల్ ను ఒక సాధారణ యువకుడు ప్రశ్నిస్తే ఏమౌతుంది? ఎదిరిస్తే ఏం జరుగుతుంది? అనే అంశం చుట్టూ ఈ కథను అల్లుకున్నారు. లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ ను టచ్ చేస్తూ, విలేజ్ నేపథ్యంలో ఈ కథను నడిపించారు.
ఈ కథ మొదలైన తీరు చూసి ఇది దొరల కాలంలో ఒక యువకుడు చేసే పోరాటమేమోనని అనుకుంటారు. ఆ తరువాత స్వార్థ రాజకీయ నాయకుల కారణంగా ఒక గూడెం ప్రజలకు ఎలాంటి అన్యాయం జరిగింది అనేది ప్రధానమైన కథ కావొచ్చునని అనుకుంటారు. అంతలో క్షుద్ర విద్యలు – నరబలి అనే అంశం తెరపైకి వస్తుంది. ఇలా ఇది కాదు .. అది అన్నట్టుగా అంచెలంచెలుగా కథ మలుపులు తీసుకుంటూ, ప్రేక్షకుడు ఏ అంశానికి కట్టుబడి ఉండాలనేది తెలియని ఒక అయోమయానికి గురి చేస్తుంది.
100 మందికి పైగా కన్నెపిల్లలను బలిచ్చిన విషయం చివరి వరకూ హీరోకి తెలియకపోవడం .. హీరో ఐదుగురు చెల్లెళ్లను ఒకేసారి ఇంటి నుంచి తీసుకుని వెళుతున్న సంగతి ఎవరికీ తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆభరణాలు కరిగించి ఆయుధాన్ని తయారు చేయడం .. శవాలను ఎడ్ల బండ్లపై వేసి పంపించడం .. నెత్తుటి ధారలు ఇంటర్వెల్ అనే అక్షరాలుగా మారడం వంటి సన్నివేశాలు కాస్త అతిగా అనిపిస్తాయి.
మాటిమాటికి మలుపు తిరిగే ఈ కథలో ఫైనల్ ట్విస్ట్ కూడా ప్రేక్షకులు ఉలిక్కిపడేలా చేస్తుంది. కాస్త అనుభవం ఉన్నవారిని పాత సినిమాల కాలంలోకి తీసుకుని వెళుతుంది. 1960ల నేపథ్యంలో నడిచే కథ కావడం వలన విలన్ అనుచరులు సైకిల్ ఉపయోగించడం వరకూ ఓకే. కాకపోతే కిడ్నాప్ చేసిన కన్నెపిల్లలను మూటగట్టి సైకిల్ పై తీసుకుని వెళ్లడం .. అదీ అమావాస్య రాత్రుళ్లు .. ఇది కాస్త విడ్డూరంగానే అనిపిస్తుంది.
సాధారణంగా ప్రీ క్లైమాక్స్ నుంచి కొట్లాటలు ఊపందుకుని, క్లైమాక్స్ ఉద్ధృతస్థాయికి చేరుకుంటాయి. కానీ ఈ సినిమా సెకండాఫ్ నుంచే రివేంజ్ మొదలవుతుంది. వరసబెట్టి తలలు తెగిపడుతూ ఉంటాయి. రక్తంతో స్నానాలు చేస్తుంటారు. కానీ ఆడియన్స్ కి ఏమీ అనిపించదు. అందుకు కారణం .. ఎమోషన్స్ లేకపోవడం .. ఉన్నది కనెక్ట్ కాకపోవడం అనే చెప్పాలి.
శర్వానంద్ లుక్ పరంగా కాస్త డిఫరెంట్ గా అయితే కనిపించాడు. కాకపోతే కథలో విషయం లేకపోవడం వలన, ఆయన ఏమీ చేయలేకపోయాడు. హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ అయినప్పటికీ, పాపం ఆమె పాత్రకి అంతగా ప్రాధాన్యత కనిపించదు. ఇక డింపుల్ హయతి ‘వేశ్య’ పాత్ర వలన ప్రయోజనం ఏమిటనేది మనకి తెలియదు. ఇక ‘ఆడుకాలం నరేన్’ ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఆయన కనిపించిన సీన్ కూడా చాలా కృతకంగా అనిపిస్తుంది.
కిశోర్ కుమార్ ఫొటోగ్రఫీ బాగుంది. అడవి నేపథ్యంలోని విజువల్స్ ఆకట్టుకుంటాయి. భీమ్స్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. తమ్మిరాజు ఎడిటింగ్ విషయానికి వస్తే, కొన్ని యాక్షన్ సీన్స్ ను ఇంకాస్త ట్రిమ్ చేసుకోవచ్చునని అనిపిస్తుంది. సాధారణంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది సెకండాఫ్ పై కుతూహలాన్ని పెంచుతుంది. కానీ ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ నిరాశపరుస్తుంది .. బలహీనమైన స్క్రీన్ ప్లే నిట్టూర్పు విడిచేలా చేస్తుంది.

Post Views: 1