పలాస, Y7 న్యూస్ తెలుగు:
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 17వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించింది. 17వ వార్డు అభ్యర్థి పండా శ్రీను, చైర్మన్ అభ్యర్థి తలాసు శ్రీ పద్మకు మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి మహిళలతో మాట్లాడిన నాయకులు, గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా ఓటర్లకు కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో దుర్గ శంకర్, పండా సుజాత యాదవ్‌తో పాటు వార్డు నాయకులు, మహిళా కార్యకర్తలు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 12









