142 మంది సివిల్ కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్లో పాల్గొన్న మంత్రి
శ్రీకాకుళం, సెప్టెంబర్ 29 (Y7 న్యూస్):
శ్రీకాకుళం రూరల్ మండలం తండేంవలస పోలీస్ శిక్షణ కేంద్రంలో 142 మంది సివిల్ కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ మంగళవారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, పోలీసులు నిజాయితీగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజల హక్కులను గౌరవించాలని సూచించారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు మహిళల భద్రత, డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు భద్రత అంశాల్లో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
శిక్షణ పూర్తి చేసుకున్న 142 మంది కానిస్టేబుళ్లకు అభినందనలు తెలిపిన మంత్రి, ప్రజలకు చేరువగా ఉంటూ సేవా దృక్పథంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్, జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.









