భద్రాచలం, సెప్టెంబర్ 27 (Y7 News Telugu): భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం ఉదయం 7 గంటలకు 40.40 అడుగులకు చేరింది. ప్రస్తుతం 8,19,285 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరికకు 2.60 అడుగుల దూరంలో ఉంది.
మొదటి ప్రమాద హెచ్చరిక: 43 అడుగులు – 9,32,288 క్యూసెక్కులు
రెండో ప్రమాద హెచ్చరిక: 48 అడుగులు – 11,44,645 క్యూసెక్కులు
మూడో ప్రమాద హెచ్చరిక: 53 అడుగులు – 14,26,684 క్యూసెక్కులు
గోదావరి వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
చారిత్రక గరిష్ఠ వరదలు:
1986లో భద్రాచలం వద్ద అత్యధికంగా 75.60 అడుగుల నీటిమట్టం, 27.02 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. 2022లో 71.30 అడుగుల నీటిమట్టంతో 24.43 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది.








