కీర్తి సురేష్ అంటేనే హోమ్లీ క్యారెక్టర్స్‌కి కేరాఫ్ అడ్రస్. సినిమాల విషయంలో కూడా కొన్ని బౌండరీస్ మెయింటైన్ చేస్తూ వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మాత్రం తన కెరీర్‌లోనే ఊహించని విధంగా ఒక డిఫరెంట్ రోల్‌లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది.
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘డోరతీ’. ఈ సినిమా తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమాపై చర్చ జోరుగా సాగుతోంది.
ముఖ్యంగా సినిమాలో ఉన్న కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలు, కీర్తి సురేష్ పాత్రలోని బోల్డ్ యాంగిల్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అంతేకాదు.. సినిమాలో LGBTQ సంబంధిత అంశాలను కూడా చూపించడంతో కొంతమంది సోషల్ మీడియా యూజర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.
ఇద్దరు పురుషుల మధ్య ప్రేమను కథలో భాగంగా చూపించడంతో కొందరు సినిమా బృందంపై విమర్శలు చేస్తున్నారు. మరికొందరు అయితే సినిమాను బాయ్‌కాట్ చేయాలని, బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.
1990ల కాలం నాటి మధురై నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కుల వివక్ష, హింస, పురుషాధిక్యత వంటి సామాజిక అంశాలను కథలో భాగంగా చూపించినట్లు తెలుస్తోంది. రిషికాంత్, సనంత్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు.
ఇక ఈ సినిమా కంటెంట్‌పై అభ్యంతరాల నేపథ్యంలో మలేషియాలో విడుదలకు సంబంధించిన వివాదం కూడా చర్చకు వచ్చింది. అయితే సినిమాపై వస్తున్న విమర్శలు, ప్రేక్షకుల స్పందనపై అధికారికంగా ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.
మరోవైపు ‘డోరతీ’ని తెలుగులోనూ విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఏపీ, తెలంగాణలో స్పిరిట్ మీడియా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
మరి తమిళంలో వివాదాలకు కేంద్రంగా మారిన ‘డోరతీ’కి తెలుగులో ఎలాంటి స్పందన వస్తుంది? కీర్తి సురేష్ డిఫరెంట్ అవతార్‌ను తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.









