E-PAPER

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 26 (Y7 News Telugu): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

తెలంగాణ ప్రజల హక్కులు, భూమి, భుక్తి, విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని అధికారులు స్మరించుకున్నారు. భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీ, సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ ఇ. శ్రీనివాస్ మాట్లాడుతూ, అణగారిన వర్గాల హక్కుల కోసం చాకలి ఐలమ్మ నిర్భయంగా పోరాడారని, ఆమె త్యాగాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం, ఆత్మగౌరవం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ ఆమె ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ రాజు, ఆర్‌ఐ ఎంటీఓ సుధాకర్, ఆర్‌ఐ వెల్ఫేర్ కృష్ణారావు, ఆర్‌ఎస్‌ఐ ఎర్ర నాయుడు తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!