E-PAPER

భారత్‌లో భారీగా తగ్గిన శాంసంగ్‌ లాభాలు.. ఇంతలా పడిపోవడానికి కారణమేంటి..?

ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ శాంసంగ్‌ ఇండియా లాభాలు భారీగా తగ్గాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కన్సాలిడేటెడ్‌ లాభం 36 శాతం పడిపోయింది. దీంతో కంపెనీ లాభం రూ.11,287.50 కోట్ల నుంచి రూ.7,228.10 కోట్లకు చేరింది.

2026 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివరాలను కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్స్‌లో వెల్లడించింది. వ్యాపార సమాచార వేదిక టోఫ్లర్‌ ద్వారా ఈ వివరాలు అందుబాటులోకి వచ్చాయి.

అయితే కంపెనీ నిర్వహణ ఆదాయం మాత్రం స్వల్పంగా పెరిగింది. 2024-25లో రూ.1,11,183.40 కోట్లుగా ఉన్న ఆదాయం.. 2025-26లో 1.2 శాతం పెరిగి రూ.1.12 లక్షల కోట్లకు చేరింది. ఇతర ఆదాయాలను కలిపితే మొత్తం కన్సాలిడేటెడ్‌ ఆదాయం రూ.1,14,738.60 కోట్లుగా నమోదైంది.

భారత్‌లో శాంసంగ్‌కు మొబైల్‌ ఫోన్ల వ్యాపారం కీలక ఆదాయ వనరుగా ఉంది. స్మార్ట్‌ఫోన్లతో పాటు టీవీలు, ట్యాబ్లెట్లు, గృహోపకరణాలు, కంప్యూటర్ల విభాగాల్లోనూ కంపెనీకి భారీ మార్కెట్‌ ఉంది. దేశంలో అప్లయెన్సెస్‌, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ రంగంలో రూ.1 లక్ష కోట్ల టర్నోవర్‌ను దాటిన ఏకైక సంస్థగా శాంసంగ్‌ కొనసాగుతోంది.

ఇదే సమయంలో భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌, ఎలక్ట్రానిక్స్‌ మార్కెట్‌లో పోటీ తీవ్రంగా ఉంది. దేశీయ, అంతర్జాతీయ సంస్థలు మార్కెట్‌ వాటా కోసం గట్టిగా పోటీ పడుతున్నాయి. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, మందగించిన వినియోగదారుల డిమాండ్‌, సంస్థాగత మార్పుల నేపథ్యంలో శాంసంగ్‌ ఇండియా ఇటీవల టీవీ, హోమ్‌ అప్లయెన్సెస్‌ విభాగాల్లో ఉద్యోగుల తొలగింపులు చేపట్టినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. డైరెక్టర్లు, టీమ్‌ లీడర్లు, బ్రాంచ్‌ మేనేజర్లు, ఏరియా మేనేజర్లు వంటి వివిధ స్థాయిల ఉద్యోగులపై ఈ ప్రభావం పడినట్లు సమాచారం.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!