రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ లో విద్యార్దుల తిరుగుబాటు తలెత్తడం, దాన్ని అణచివేసేందుకు విఫలయత్నం చేసి పదవీచ్యుతురాలై భారత్ కు శరణార్ధిగా పారిపోయి వచ్చేసిన మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇప్పుడు ఎటుచూసినా సమస్యలే కనిపిస్తున్నాయి. ఓవైపు భారత్ కు వచ్చి రెండేళ్లవుతున్నా ఇక్కడ నుంచి తన స్వరం వినిపించే పరిస్దితి కనిపించడం లేదు, అలాగే స్వదేశంలో తన కోసం ఎదురుచూస్తూ నిషేధం నీడలో మగ్గుతున్న సొంత పార్టీ అవామీ లీగ్ ను కాపాడుకోవాల్సిన పరిస్దితి ఆమెది. దీంతో తనపై బంగ్లాదేశ్ లో మోపిన నేరాలకు ఉరిశిక్ష ఎదురైనా సరే తిరిగి వెళ్లిపోతానని ఆమె చెబుతూ వస్తున్నారు
అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. గతంలో షేక్ హ.సీనా భారత్ కు పారిపోయి వచ్చి తలదాచుకున్న తర్వాత.. ఆమెను తిరిగి తమకు అప్పగించాలని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం పదే పదే కోరింది. అయినా భారత్ కానీ, హసీనా కానీ స్పందించలేదు. ఆ తర్వాత ఎన్నికలు జరిగి తారిఖ్ రెహ్మన్ నేతృత్వంలో రెగ్యులర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇదే విజ్టప్తి చేస్తున్నా వీరిద్దరూ స్పందించడం లేదు. తాజాగా భారత్ రావాలనుకున్న అక్కడి ప్రధాని తారిఖ్ రెహ్మన్.. చివర్లో హసీనాను అప్పగిస్తేనే అని కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి భారత్ తిరస్కరించడంతో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నారు.








