అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండల కేంద్రంలోని గొల్ల బజార్ ఎస్టీ కాలనీలో రోడ్లు వర్షాకాలంలో బురదతో నిండి, ప్రజలు నడవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు తిరగడానికి కష్టంగా మారింది. కొద్దిపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచి బురదమయం అవుతుంది. రోడ్డు బురద మయం కావడంతో కాలనీ ప్రజలు కనీసం కాలినడకనా నడవలేని దుస్థితి. వాహన దారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. సైకిల్, బైక్ మీద కూడా కూడా వెళ్లేలేని పరిస్థితి నెలకొంది. పంచాయతీ అధికారులు మరియు ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్య పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. మాకు రోడ్ వెయ్యకుండా నిర్లక్ష్యం వహిస్తే రానున్న స్థానిక ఎన్నీకలను ముక్కుముడిగా బహిస్కరిస్తామని కాలనీ వాసులు హెచ్చరిస్తున్నారు… డివిజన్ కేంద్రం లోనే ఈ పరిస్థితి ఇలా ఉంటే నాలుగు మండలాలలో పరిస్థితి ఏ విధంగా ఉన్నాయో ఊహించుకోవచ్చు అని గొల్ల బజార్ కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.









