శ్రీకాకుళం జిల్లా, పలాస | ఆగస్టు 11:
మందస మండలం సరియాపల్లి గ్రామంలో నిర్వహించిన “ఇంటింటికీ కూటమి ప్రభుత్వం” కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా కలుసుకున్నారు. వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
“ప్రజల వద్దకే ప్రభుత్వం.. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని గౌతు శిరీష పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సహకారంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందని ఆమె తెలిపారు.








