
చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్!
రేపు జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి 3 జీవో ప్రకటన చెయ్యాలి
ఎన్నికలలో 3 జీవోకు బదులు ప్రత్యామ్నాయ జీవో హామీనీ నిలబెట్టుకోవాలనీ
ఆదివాసి గిరిజన సంఘాల నాయకులు డిమాండ్
చింతూరు, ఆగస్టు 08: ఏజెన్సీ వ్యాప్తంగా గిరిజన సంఘం తల పెట్టిన మన్యం బంద్ చింతూరు డివిజన్ లో సంపూర్ణంగా విజయవంతం అయ్యింది. వ్యాపారస్థులు స్వచందంగా షాపులు మూసివేసి బంద్ పాటించారు.ఆదివాసీ యువత స్వచ్ఛందంగా రోడ్లపై వచ్చి మా ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలు పూర్తిగా ఆదివాసీ లతోనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రద్దు అయిన 3 జీవో కు ప్రత్యామ్నాయంగా మరోక జీవో ఇచ్చి గిరిజనులకు అండగా నిలబడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏజెన్సీలో 1/70 చట్టం నిర్వీర్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పకడ్బందిగా అమలు చేసే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మా చట్టాలను తుంగలో తొక్కి ఏజెన్సీ సంపదను కొల్లగొట్టాలని ప్రభుత్వ పాలకులు ప్రయత్నాలను తిప్పి కొడతామని హెచ్చరించారు. ఏజెన్సీలో ఆదివాసీ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఏజెన్సీలో అధికారులు పని తీరు, పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతో ఆదివాసీలు చదువులలో వెనుకబాటుకు దూరం అవుతున్నారు ప్రభుత్వం పై అసహనం వ్యక్తం చేశారు. రేపు జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 3 జీవో ప్రకటన చెయ్యాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు, కార్యక్తలు,ఆదివాసీ యువత , యువతులు , తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని మన్యం బంద్ ను విజయవంతం చేశారు.
– రిపోర్టర్ బాబూరావు భూక్యా








