E-PAPER

మృతుడి కుటుంబానికి అండగా బీఆర్ఎస్ నాయకులు.. దశదిన కర్మలకు 50 కేజీల బియ్యం అందజేత

కరకగూడెం, ఆగస్టు 1 (వై7 న్యూస్ తెలుగు)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చొప్పాల గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన జాడి మెంగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులు పరామర్శించి తమ సానుభూతిని తెలిపారు.

శనివారం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య ఆధ్వర్యంలో నాయకులు జాడి మెంగయ్య నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కష్టకాలంలో బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

అనంతరం జాడి మెంగయ్య దశదిన కర్మల నిర్వహణకు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బీఆర్ఎస్ నాయకుల సేవా కార్యక్రమాన్ని అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచులు కుమ్మరి సమ్మయ్య, బుడగం రాము, మాజీ ఉప సర్పంచ్ అత్తె సత్యనారాయణ, కొండగొర్ల కోటి, పాయం కృష్ణ, కొండగొర్ల నరసింహారావు, కుమ్మరి కుమార్, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: దిలీప్, కరకగూడెం.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!