E-PAPER

బోటిగూడెంలో ఆదివాసి పిల్లలకు బట్టల పంపిణీ

పినపాక మండలం, జూలై 31 (వై7 న్యూస్): అఖండ యూనివర్సల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పినపాక మండలం బోటిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని విప్పలగుంపు ఆదివాసి గ్రామంలో 43 మంది ఆదివాసి పిల్లలకు బట్టలు పంపిణీ చేశారు.

సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులకు నూతన దుస్తులను అందజేసి వారి ఆనందానికి కారణమయ్యారు. గ్రామంలోని ఆదివాసి కుటుంబాల పిల్లలకు అవసరమైన సహాయం అందించడం ట్రస్ట్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అఖండ యూనివర్సల్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు కట్ల నరేష్, నాని బాబు, కె. నాగేశ్వరరావు, ఆకుల వెంకటేష్, సైదా నాయుడు, బోటిగూడెం మాజీ సర్పంచ్ సుధాకర్, ఈశ్వరయ్య, విప్పలగుంపు గ్రామ పెద్దలు నరసయ్య, మడకం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News