చింతూరు,( వై7 న్యూస్) జూలై 31: చింతూరు మండలం, ఏడుగురాళ్లపల్లి లో లీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో ఇగ్నతిస్ లయోలా వారి పేరు మీద అనేక పాఠశాలలు స్థాపించి విద్యా మరియు వైద్యం గ్రామీణ ప్రాంతాల్లో అందించి వారి అభివృద్ధికి బాటలు వేశారు. ఆ సంస్థ భాగంగానే కాటకపల్లి లీడ్స్ సంస్థ 40 సంవత్సరాల పాటు ఆదివాసి ప్రాంతాల్లో ఎంతో మందికి ఉన్నత విద్యాను అందించి ఆదివాసీ యువత భవిష్య మార్చాగలిగిన సంస్థ. నేడు సంస్థ స్థాపకులు ఇగ్నతిస్ పండుగ కార్యక్రమం ఫాదర్ రేవా. నరేష్ వారి చేతుల మీదుగా పండుగ జరిపించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ సెల్వం, బ్రదర్ రేక్స్ కుమార్ , లీడ్స్ సంస్థ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు వైస్ ఎంపీపీ ఎడమ అర్జున్, మాజీ సర్పంచ్ సవలం సత్తిబాబు, ఉప సర్పంచ్ బి బాబురావు, ఉపాధ్యాయులు,పిల్లలు, తల్లితండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 6








