E-PAPER

Huawei Nova 16 SE: 8,500mAh బ్యాటరీతో అదరగొట్టనున్న హువావే కొత్త ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?

హువావే నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి రాబోతోంది. Huawei Nova 16 SE పేరుతో రూపొందించిన ఈ ఫోన్‌ను ఆగస్టు 5న చైనాలో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే టీజర్ల ద్వారా ఫోన్‌ వివరాలను వెల్లడించిన హువావే.. తాజాగా లైవ్ ఇమేజ్‌లు కూడా ఆన్‌లైన్‌లో కనిపించాయి. 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 ప్రాసెసర్‌తో మిడ్‌ రేంజ్ సెగ్మెంట్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

డిజైన్ పరంగా Nova 16 SE ఆకట్టుకునేలా కనిపిస్తోంది. కంపెనీ విడుదల చేసిన టీజర్ ప్రకారం.. ఫోన్ వెనుక భాగంలో పెద్ద హారిజాంటల్ కెమెరా మాడ్యూల్‌ను అందించారు. ఇందులో మూడు కెమెరా రింగులు త్రిభుజాకార లేఅవుట్‌లో అమర్చినట్లు తెలుస్తోంది. ఈ డిజైన్ Honor Power 2, iPhone 17 Pro సిరీస్‌ను పోలి ఉండటం విశేషం. ముందు భాగంలో సన్నని బెజెల్స్‌తో సెంటర్ పంచ్-హోల్ డిస్‌ప్లేను అందించారు.

ప్రస్తుతం కంపెనీ Cherry Blossom Snow Sky కలర్ వేరియంట్‌ను మాత్రమే టీజర్‌లో చూపించింది. అయితే Weiboలో లీకైన లైవ్ ఫొటోల ప్రకారం ఈ ఫోన్ బ్లాక్, ఆరెంజ్, వైట్ కలర్ ఆప్షన్లలో కూడా లభించే అవకాశం ఉంది. భారీ బ్యాటరీ, కొత్త డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్‌తో వస్తున్న Huawei Nova 16 SEపై ఇప్పటికే ఆసక్తి పెరిగింది. ఆగస్టు 5న జరిగే లాంచ్ ఈవెంట్‌లో ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, ఇతర ఫీచర్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News