ప్రముఖ ఫీచర్ ఫోన్ బ్రాండ్ నోకియా నుంచి మరో కొత్త మొబైల్ మార్కెట్‌లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. Nokia 100 (2026) పేరుతో HMD Global ఈ కొత్త ఫీచర్ ఫోన్‌ను త్వరలో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఫోన్‌కు సంబంధించిన రెండర్లు, కీలక స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. బడ్జెట్ ధరలో కెమెరా, LED ఫ్లాష్‌లైట్, పెద్ద బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
లీకైన చిత్రాలను పరిశీలిస్తే Nokia 100 (2026) డిజైన్ పాత Nokia 105ను పోలి ఉంటుంది. అయితే కొత్త మోడల్‌లో అంచులు కొద్దిగా గుండ్రంగా ఉండటంతో మరింత కాంపాక్ట్ లుక్ కనిపిస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ @smashx_60 Xలో ఫోన్‌కు సంబంధించిన చిత్రాలను షేర్ చేసినట్లు సమాచారం. సాధారణ ఫీచర్ ఫోన్‌లను ఇష్టపడే యూజర్లను దృష్టిలో పెట్టుకునేలా నోకియా ఈ డిజైన్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.
కొత్త Nokia 100 (2026)లో కెమెరా, LED ఫ్లాష్‌లైట్‌తో పాటు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అందించే బ్యాటరీ ఉండొచ్చని లీకుల ద్వారా తెలుస్తోంది. అయితే ఫోన్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, లాంచ్ తేదీపై HMD Global నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఒకప్పుడు ఫీచర్ ఫోన్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నోకియా.. ఈ కొత్త మోడల్‌తో మరోసారి బడ్జెట్ ఫోన్ మార్కెట్‌లో తన పాత క్రేజ్‌ను తిరిగి తెచ్చుకుంటుందేమో చూడాలి.








