అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ మరోసారి సమావేశం కానున్నారు. వచ్చే మంగళవారం వైట్‌హౌస్‌లో జరగనున్న ఈ కీలక భేటీని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా శాంతి చర్చలను వేగవంతం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై ఇరు దేశాధినేతలు విస్తృతంగా చర్చించనున్నట్లు సమాచారం.
ముఖ్యంగా క్షిపణులు, డ్రోన్ దాడులను నిలిపివేసే వాయు కాల్పుల విరమణ ప్రతిపాదన ఈ సమావేశంలో కీలక అంశంగా ఉండనుంది. యుద్ధ విరమణకు మార్గం సుగమం చేసే నిర్ణయాలపై ట్రంప్, జెలెన్‌స్కీ చర్చించే అవకాశముందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
Post Views: 3








